Prabhas: ప్రభాస్ .. మహేశ్ స్టార్స్ అవుతారని ముందే చెప్పాను: సీనియర్ నటుడు శివకృష్ణ

Shivakrishna Interview

  • 'ఈశ్వర్' సినిమా గురించిన ప్రస్తావన 
  • ప్రభాస్ గొప్పగా చేశాడన్న శివకృష్ణ  
  • చైల్డ్ ఆర్టిస్టుగా మహేశ్ ను చూశానని వెల్లడి 
  • అప్పుడే డైలాగ్స్ గొప్పగా చెప్పేవాడని వ్యాఖ్య  

ఒకప్పుడు ఉద్యమ నేపథ్యంలోని సినిమాల్లో .. తిరుగుబాటు పాత్రలను పోషించడంలో శివకృష్ణ తనకి సాటిలేదని నిరూపించుకున్నాడు. హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా .. నిర్మాతగా ఎంతో అనుభవం ఉన్న శివకృష్ణ, తాజా ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. 

"ప్రభాస్ ఫస్టు పిక్చర్ 'ఈశ్వర్' సినిమాలో నేను ఆయనకి ఫాదర్ వేషం వేశాను. అప్పుడు నాతో చేసిన ప్రభాస్ ఈ రోజున ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు అంటే నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. అప్పటికీ .. ఇప్పటికీ ఆయన ప్రవర్తనలో ఎంతమాత్రం మార్పు రాకపోవడం విశేషం. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసే, గొప్ప స్టార్ అవుతాడని చెప్పాను .. అదే నిజమైంది" అన్నారు. 

"ఇక నేను .. కృష్ణగారు చేసిన 'పోరాటం' సినిమాలో మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. ఆ సినిమాలో మహేశ్ బాబు డైలాగ్ చెప్పే తీరు చూసి, కృష్ణగారి తరువాత నెక్స్ట్ సూపర్ స్టార్ అతనే అని చెప్పాను. వాళ్లలోని స్పార్క్ చూడగానే మనకి తెలిసిపోతూ ఉంటుంది. నేను అనుకున్నట్టుగానే జరిగింది" అంటూ చెప్పుకొచ్చారు.

Prabhas
Mahesh Babu
Shivakrishna
Tollywood
  • Loading...

More Telugu News