Apple watch ultra: రూ.2,500తో.. అచ్చం యాపిల్ ను పోలిన వాచ్!
- ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ వాచ్
- ఈ నెల 30న విడుదల
- అమెజాన్ లో విక్రయాలు
- యాపిల్ వాచ్ ను పోలిన డిజైన్
యాపిల్ వాచ్ అల్ట్రా.. చూస్తే మనసు పారేసుకుంటారు. చేతికి పెట్టుకునే వరకు మనసు ఊరుకోదు. కానీ, ధర చూస్తే రూ.89,900. అంత భారీ ధర పెట్టి ఆ సుందర వాచ్ ను కొనుక్కోవడం ఎంత మందికి సాధ్యపడుతుంది? అందుకని యాపిల్ వాచ్ అల్ట్రా ను పోలిన డిజైన్, మంచి ఫీచర్లతో రూ.3 వేల లోపు ధరకే స్మార్ట్ వాచ్ వస్తుంటే కాదనగలరా? దేశీ కంపెనీ ఫైర్ బోల్ట్ త్వరలోనే ఒక కొత్త స్మార్ట్ వాచ్ ను విడుదల చేయబోతోంది.
ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ అనే ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.2,499 స్థాయిలో ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. కంపెనీ ధరను ఇంకా ప్రకటించలేదు. ఈ నెల 30న (శుక్రవారం) గ్లాడియేటర్ విడుదల కానుంది. అమెజాన్ వెబ్ సైట్ లో దీని లాంచింగ్ గురించి ప్రకటన కనిపిస్తోంది.
స్పెసిఫికేషన్లు
ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ 1.96 అంగుళాల డిస్ ప్లేతో ఉంటుంది. యాపిల్ వాచ్ అల్ట్రా కంటే స్క్రీన్ సైజు కొంచెం పెద్దగా ఉంటుంది. స్క్రీన్ బ్రైట్ నెస్ 600 నిట్స్ తో ఉంటుంది. ఒక్కసారి చార్జ్ తో ఏడు రోజులు వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ కోసం చార్జింగ్ రెండు రోజుల పాటు ఉంటుంది. క్రాక్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్, ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. 123 స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి. పరుగెత్తినా, నడిచినా ఎన్ని కేలరీలు ఖర్చు అయ్యాయో చెబుతుంది. హార్ట్ రేట్ ను ట్రాక్ చేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మహిళల ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇన్ బిల్ట్ గా కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి.