Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్ర పేరు ఖరారు.. జనవరి 27న పాదయాత్ర ప్రారంభం

Nara Losh pada yatra name is Yuva Galam

  • లోకేశ్ పాదయాత్రకు 'యువ గళం'గా నామకరణం
  • కుప్పం నుంచి ప్రారంభమై 4 వేల కిలోమీటర్లు కొనసాగనున్న యాత్ర
  • 100 నియోజకవర్గాల గుండా కొనసాగనున్న పాదయాత్ర

వచ్చే ఎన్నిల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్న సంగతి తెలిసిందే. పాదయాత్రకు 'యువ గళం' అనే పేరును ఖరారు చేశారు. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. 100 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగుతుంది. యువత, మహిళలు, రైతుల సమస్యలను ప్రతిబింబించేలా పాదయత్రను నిర్వహించనున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా పాదయాత్ర కొనసాగనుంది. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో పాదయాత్ర పోస్టర్ ను విడుదల చేశారు.

Nara Lokesh
Pada Yatra
Yuva Galam
Telugudesam
  • Loading...

More Telugu News