Anushka Shetty: రెండేళ్ల తరువాత కొత్త ప్రాజెక్టును పూర్తిచేసిన అనుష్క!

Anushka Upcoming movie update

  • యూవీ బ్యానర్లో రూపొందిన సినిమా
  • చెఫ్ పాత్రలో కనిపించనున్న అనుష్క
  • మహేశ్ దర్శకత్వంలో షూటింగు పూర్తి 
  • వచ్చే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు  

అందమైన అభినయానికి ఆనవాలుగా అనుష్క కనిపిస్తుంది. సాంఘిక చిత్రాలలో మాత్రమే కాదు, జానపద .. పౌరాణిక చిత్రాలలో సైతం చక్కగా ఒదిగిపోయే కనుముక్కుతీరు ఆమె సొంతం. ఆరంభంలో గ్లామరస్ పాత్రలను చేస్తూ వచ్చిన అనుష్క, ఆ తరువాత నటన ప్రధానమైన .. నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళుతోంది.

అనుష్క చేసిన 'అరుంధతి' .. 'రుద్రమదేవి' .. 'భాగమతి' సినిమాలు ఆమె స్థాయిని మరింత పెంచాయి. అయితే 'సైలెన్స్' తరువాత ఆమె మరే సినిమా చేయలేదు. రెండేళ్లుగా ఆమె ఒక్క సినిమా కూడా ఒప్పుకున్నది లేదు. అయినా ఆమెపై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అనుష్క ఫలానా ప్రాజెక్టు ఒప్పుకుందట అంటూ హల్ చల్ చేసిన వార్తలు పుకార్లుగానే మిగిలిపోయాయి. 

అలా ఈ ఏడాది కూడా అనుష్క సినిమా లేకుండానే గడిచిపోయింది. వచ్చే ఏడాది మాత్రం ఆమె నుంచి ఒక సినిమా రానున్నట్టుగా తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా సరోగసి చుట్టూ తిరుగుతుందనీ, చెఫ్ పాత్రలో అనుష్క కనిపిస్తుందని అంటున్నారు. మహేశ్ దర్శకత్వంలో ఇప్పటికే షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

Anushka Shetty
UV Creations
Tollywood
  • Loading...

More Telugu News