Prabhas: న్యూ ఇయర్ కానుకగా 'ప్రాజెక్ట్ K' నుంచి అప్ డేట్?

Project K Movie Update

  • మరో పాన్ ఇండియా సినిమాగా 'ప్రాజెక్టు K'
  • 500 కోట్లు ఖర్చు చేస్తున్న వైజయంతీ మూవీస్ 
  • సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథ
  • ప్రభాస్ సరసన నాయికగా దీపిక పదుకొణె
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న అమితాబ్ 

ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 'ప్రాజెక్టు K' సినిమా రూపొందుతోంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మితమవుతోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథలో సూపర్ హీరో పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. 

ఈ సినిమాకి సంబంధించి ఒకటి రెండు స్టిల్స్ తప్ప, వేరే అప్ డేట్స్ ఇంతవరకూ బయటికి రాలేదు. దాంతో ప్రభాస్ లుక్ ఎలా ఉండనుంది? టైటిల్ ఎలా ఉండబోతోంది? అనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ప్రభాస్ పాత్రను నాగ్ అశ్విన్ ఎలా డిజైన్ చేశాడా? అనే విషయంపై కూడా అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. 

ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుంచి అప్ డేట్ వచ్చే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ లుక్ తో పాటు .. టైటిల్ ను కూడా రివీల్ చేయొచ్చని అంటున్నారు. దీపిక పదుకొణె నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, కీలకమైన పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు.

Prabhas
Deepika Padukone
Amitabh Bachchan
Project K Movie
  • Loading...

More Telugu News