Allu Arjun: 'రేసుగుర్రం'తో హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డికి బన్నీ గ్రీన్ సిగ్నల్!

Allu Arjun in Surendar Reddy Movie

  • సురేందర్ రెడ్డితో 'రేసుగుర్రం' చేసిన బన్నీ 
  • ఆయన కెరియర్లో అది చెప్పుకోదగిన సినిమా 
  • వసూళ్ల పరంగా కొత్త రికార్డుల నమోదు 
  • తాజాగా బన్నీకి కథను వినిపించిన సురేందర్ రెడ్డి 
  • వచ్చే ఏడాదిలో పెట్టాలెక్కనున్న ప్రాజెక్టు

అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోవలసిన సినిమాల్లో 'రేసుగుర్రం' ఒకటి. 2014లో వచ్చిన ఈ సినిమా, వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నమోదు చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, బన్నీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో మంచి రేటింగును రాబడుతూ ఉంటుంది. 

అలాంటి ఈ కాంబినేషన్లో ఇంతవరకూ మరో సినిమా రాలేదు. ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న అభిమానులు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఈ కాంబోలో మరో సినిమా రానుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆల్రెడీ బన్నీకి సురేందర్ రెడ్డి కథ వినిపించడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. 

ప్రస్తుతం 'ఏజెంట్' సినిమా పనుల్లో సురేందర్ రెడ్డి బిజీగా ఉన్నాడు. పవన్ తో అనుకున్న ప్రాజెక్టు పట్టాలెక్కడానికి చాలా సమయం ఉంది. ఇక బన్నీ చేయాలనుకున్న బోయపాటి కూడా అందుబాటులో లేడు. అందువల్లనే సురేందర్ రెడ్డి - బన్నీ కాంబో ఫిక్స్ అయిందని అంటున్నారు. కొత్త ఏడాదిలో ఈ ప్రాజెక్టు మొదలుకానుందని అంటున్నారు.

Allu Arjun
Surendar Redddy
Resu Gurram
Tollywood
  • Loading...

More Telugu News