Intermediate Exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Inter exam schedule released in AP

  • మార్చి 15 నుంచి ప్రారంభం  
  • ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు
  • ఏప్రిల్, మే నెలల్లో ప్రాక్టికల్స్

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరపనున్నారు. ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల టైమ్ టేబుల్ ను నేడు ప్రకటించింది. 

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. కాగా, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. 

ప్రాక్టికల్ పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి 25వ తేదీ వరకు... ఏప్రిల్ 30 నుంచి మే 10వ తేదీ వరకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.

Intermediate Exams
Schedule
Time Table
Andhra Pradesh
  • Loading...

More Telugu News