NRI TDP: ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో 13 మంది యువతకు అమెరికాలో ఉద్యోగాలు

NRI TDP employments 13 youth in US

  • హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులు
  • అమెరికాలోని పలు హోటళ్లలో ఉద్యోగాల కల్పన
  • టీడీపీ కార్యాలయంలో ఆఫర్ లెటర్ల అందజేత 

తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో 13 మంది యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులో ఉత్తీర్ణులైన 13 మంది విద్యార్థులకు అమెరికాలోని వివిధ అంతర్జాతీయ స్థాయి హోటళ్లలో ఉద్యోగం లభించింది. 

తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం గత కొంతకాలంగా ఉపాధ్యాయులు, ఎంబిఏ, ఇంజనీరింగ్, ఇతర టెక్నికల్ కోర్సులలో విద్యార్థులకు ఉచితంగా జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ మరియు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా... మొదటిగా 13 మంది హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించింది. 

మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ విభాగం చైర్మన్ రామాంజనేయులుతో పాటు పార్టీ ఎన్నారై విభాగం ఇన్చార్జి డాక్టర్ వేమూరు రవికుమార్ ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు. వారికి ఉద్యోగ నియామక నిమిత్తం లభించిన ఆఫర్ లెటర్లను అందజేశారు. అదేవిధంగా వారికి విదేశాల్లో ఉద్యోగ నిమిత్తం అవసరమైన సూచనలను సలహాలను అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచనలు, ఆదేశాల ప్రకారం హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

NRI TDP
Jobs
Hotel Management
USA
Andhra Pradesh
  • Loading...

More Telugu News