: రాహుల్ భారత యాత్ర


ప్రధానమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు యువరాజు రథమెక్కనున్నాడు. దేశవ్యాప్తంగా పర్యటించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. ప్ర్టతీ రాష్ట్రంలోనూ పర్యటించి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని యువరాజు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 18న ఒడిసా నుంచి రాహుల్ యాత్ర ప్రారంభమవుతుంది. 18, 19 రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటిస్తారు. జిల్లా, బ్లాక్ స్థాయి కాంగ్రెస్ నేతలతో సమావేశమై పార్టీ వ్యవహరాలను సమీక్షిస్తారని ఏఐసీసీ నేత జగదీష్ టైట్లర్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న సీఎల్పీ, పీసీసీ నేతల భేటీలో రాహుల్ ఈ విషయం ప్రకటించినట్లు టైట్లర్ తెలిపారు.

  • Loading...

More Telugu News