DRDO: ప్రళయ్ క్షిపణుల కొనుగోలుకు రక్షణ శాఖ నిర్ణయం

Armed Forces To Buy Pralay Missiles

  • చైనా, పాక్ బార్డర్ లో మోహరించేందుకు 120 క్షిపణుల కొనుగోలుకు ఆమోదం
  • రక్షణ శాఖ అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయం.. డీఆర్డీవోకు ప్రతిపాదన
  • 2015 నుంచి ఈ క్షిపణులను తయారుచేస్తున్న డీఆర్డీవో శాస్త్రవేత్తలు

చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యాధునిక క్షిపణులను కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. ఈమేరకు అత్యున్నత స్థాయి సమావేశంలో 120 ప్రళయ్ క్షిపణుల కొనుగోలుకు ఆమోద ముద్ర వేసింది. డీఆర్డీవో సొంతంగా తయారుచేస్తున్న ఈ క్షిపణుల రేంజ్ 100 కి.మీ. నుంచి 500 కి.మీ. వరకు ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

మన దాయాది దేశాలైన చైనా, పాక్ రెండూ కూడా బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇటీవల చైనా నుంచి చొరబాటు ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు దేశాల సరిహద్దుల్లో ప్రళయ్ క్షిపణులను మోహరించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. శత్రు దేశాల నుంచి మన దేశం వైపు దూసుకొచ్చే క్షిపణులను వీటితో అడ్డుకోవచ్చని శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

2015 లో భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ ఈ ప్రళయ్ క్షిపణులను అభివృద్ధి చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణులు సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా చేస్తాయి. శత్రు దేశాలు ప్రయోగించిన క్షిపణులను కూల్చేసే ప్రయత్నంలో అవసరాన్నిబట్టి గాలిలోనే దిశను మార్చుకోగలిగే సామర్థ్యం ఈ క్షిపణులకు ఉంది. మిస్సైల్ గైడెన్స్ వ్యవస్థతో పాటు అత్యాధునిక సాంకేతికతను జోడించి ఈ ప్రళయ్ క్షిపణులను తయారు చేసినట్లు డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. కాగా, కిందటేడాది ఈ క్షిపణులను పరీక్షించిన ఆర్మీ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.

DRDO
army
pralay missiles
china border
defence ministry
  • Loading...

More Telugu News