Lalu Prasad Yadav: అవినీతి కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ పై కేసును తిరగతోడిన సీబీఐ

CBI reopens corruption case against Lalu Prasad Yadav

  • రైల్వే ప్రాజెక్టుల్లో అవినీతి కేసు
  • 2021లో కేసు విచారణను క్లోజ్ చేసిన సీబీఐ
  • ఇప్పుడు మళ్లీ విచారణను ప్రారంభించిన వైనం

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఒక అవినీతి కేసును సీబీఐ రీఓపెన్ చేసింది. జేడీయూతో కలిసి బీహార్ లో ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నెలల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయపరంగా కలకలం రేపుతోంది.

 యూపీఏ-1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల్లో లాలూ ప్రసాద్ అవినీతికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి 2018లో సీబీఐ విచారణను ప్రారంభించింది. అయితే 2021 మే నెలలో విచారణను క్లోజ్ చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ కేసును సీబీఐ తిరగతోడింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, కుమార్తెలు చందా యాదవ్, రాగిని యాదవ్ లు నిందితులుగా ఉన్నారు. మరోవైపు, 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవలే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.

Lalu Prasad Yadav
RJD
Railway Projects Case
CBI
  • Loading...

More Telugu News