Pakistan: బలూచిస్థాన్‌ను కుదిపేసిన పేలుళ్లు.. ఐదుగురు పాక్ జవాన్ల మృతి

5 Pakistan soldiers killed 12 civilians injured as multiple explosions rock Balochistan

  • కోహ్లు జిల్లాలో పేలిన శక్తిమంతమైన ఐఈడీ
  • ‘లీడింగ్’ పార్టీ సమీపంలో పేలుడు
  • క్వెట్టాలో జరిగిన వేర్వేరు చోట్ల జరిగిన గ్రనేడ్ దాడిలో 12 మందికి గాయాలు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ఆదివారం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఐదుగురు పాక్ జవాన్లు మృతి చెందారు. 12 మంది పౌరులు గాయపడ్డారు. డిసెంబరు 24 నుంచి బలూచిస్థాన్‌లో పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం శక్తిమంతమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలింది. కోహ్లు జిల్లాలోని కహన్ ప్రాంతంలో ‘లీడింగ్ పార్టీ’ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్టు పాకిస్థాన్ ఆర్మీని ఉటంకిస్తూ జియో టీవీ పేర్కొంది. 

మరోవైపు, క్వెట్టాలోని శాటిలైట్ టౌన్‌లో ఉన్న పోలీస్ చెక్ పోస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పోలీసులు, ఐదుగురు పౌరులు ఉన్నారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే క్వెట్టాలో జరిగిన మరో గ్రనేడ్ దాడిలో నలుగురు గాయపడ్డారు. దేశం మొత్తం క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న వేళ ఈ దాడులు జరగడం గమనార్హం.

  • Loading...

More Telugu News