Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచిన సినీ నటుడు కమలహాసన్

Kamal Haasan on joining Rahul Gandhis Bharat Jodo Yatra

  • ఈ ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టిన భారత్ జోడో యాత్ర
  • రాహుల్ వెంట నడిచిన సోనియా, ప్రియాంక
  • రాహుల్ యాత్రకు విశేష స్పందన

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ నేడు ఢిల్లీలో ప్రవేశించింది. రాహుల్ యాత్రకు ప్రతి చోట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో రాహుల్ వెంట పలువురు ప్రముఖులు నడుస్తున్నారు. తాజాగా, ఢిల్లీలో జరుగుతున్న యాత్రలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ పాల్గొని వెంట నడిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాహుల్ ఆహ్వానం మేరకు భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి కమల్ నడుస్తారని ఎంఎన్ఎం పార్టీ ఇప్పటికే తెలిపింది. 

కాగా, ఈ ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టిన భారత్ జోడో యాత్రలో రాహుల్ తల్లి సోనియాగాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ యాత్ర డిసెంబరు 16తో వంద రోజులు పూర్తి చేసుకుంది.

Rahul Gandhi
Cong
Kamal Haasan
Bharat Jodo Yatra
  • Loading...

More Telugu News