Manchu Lakshmi: అలాంటి వాళ్లను నేను పట్టించుకోను: మంచు లక్ష్మి

I dont care trolls says Manchu Lakshmi

  • తనపై విమర్శలను పట్టించుకోనన్న మంచు లక్ష్మి
  • భూమి మీద మనిషిగా పుట్టడమే గొప్ప విషయమని వ్యాఖ్య
  • మనోజ్ కు, తనకు మధ్య విభేదాలు లేవని స్పష్టీకరణ 

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మిపై సోషల్ మీడియాలో చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ కామెంట్స్ పై ఆమె స్పందిస్తూ... తాను మాట్లాడే విధానంపై చాలా మంది విమర్శలు చేస్తుంటారని, వాటిని తాను పట్టించుకోనని చెప్పారు. తనను విమర్శించేవాళ్లు తనలా ఉండరని... అందుకే తనను విమర్శిస్తుంటారని అన్నారు. ఇలాంటి వాళ్లను తాను పట్టించుకోనని చెప్పారు. 

ఈ భూమి మీద మనిషిగా పుట్టడం చాలా గొప్ప విషయమని... తాను పుట్టినందుకు ఏదైనా గొప్పగా చేయాలనుకుంటానని అన్నారు. తన ఆలోచనలకు అనుగుణంగానే నటిగా విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ ను తాను పట్టించుకోనని తెలిపారు. 

తమ కుటుంబాలకు సంబంధించిన విషయాలను తాము ప్రైవేట్ గానే ఉంచుతామని మంచు లక్ష్మి అన్నారు. సమయం వచ్చినప్పుడు తామంతా ఒకటిగా కనిపిస్తామని చెప్పారు. మనోజ్ కు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని.. తామిద్దరం తరచుగా కలుస్తామని, ఎక్కువ సమయాన్ని ఎంజాయ్ చేస్తామని అన్నారు. విష్ణు ఎక్కువగా కుటుంబం, పిల్లలు, వర్క్ పైనే ఫోకస్ చేస్తాడని.. వీటన్నిటి వల్లే తాము ఎక్కువగా కలవబోమని చెప్పారు.

Manchu Lakshmi
Trolling
  • Loading...

More Telugu News