Team India: స్లిప్ లో విరాట్​ కోహ్లీ తడబాటు.. మూడు క్యాచ్​ లు డ్రాప్

Virat kohli drops three catches

  • 195/7తో టీకి వెళ్లిన బంగ్లాదేశ్
  • అర్ధ సెంచరీ సాధించిన లిటన్ దాస్
  • అక్షర్ పటేల్ కు మూడు వికెట్లు 

భారత్ తో రెండో టెస్టులో ఓటమి తప్పించుకునేందుకు బంగ్లాదేశ్ పోరాడుతోంది. ఓవర్ నైట్ స్కోరు 7/0తో మూడో రోజు, శనివారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 133 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి తొందరగానే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, లిటన్ దాస్, నరుల్ హసన్ అనూహ్యంగా ఎదురుదాడికి దిగారు. దాంతో, బంగ్లా 195/7 స్కోరు టీ విరామానికి వెళ్లింది. ఎప్పుడో ఆలౌటవ్వాల్సిన బంగ్లా.. భారత ఫీల్డింగ్ తప్పిదాల వల్ల ఆటను మూడో సెషన్ కు తీసుకెళ్లింది.

ముఖ్యంగా స్లిప్ లో విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. అతను ఏకంగా మూడు క్యాచ్ లు నేలపాలు చేశాడు. ఈ అవకాశాలను సద్విదియోగం చేసుకున్న లిటన్ దాస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అతను 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి తోడు తస్కిన్ అహ్మద్ 15 పరుగులతో నిలిచాడు. మొత్తంగా బంగ్లా 108 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

Team India
Virat Kohli
drops
catches
Bangladesh
test
  • Loading...

More Telugu News