Imran Khan: మళ్లీ పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్

Imran Khan ex wife Reham Khan married an actor
  • 2015లో రెహామ్ ఖాన్ ను పెళ్లాడిన ఇమ్రాన్ ఖాన్
  • అదే ఏడాది విడాకులు
  • తాజాగా ఓ నటుడ్ని పెళ్లాడిన రెహామ్ ఖాన్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్ మరోసారి పెళ్లికూతురయ్యారు. ఆమె ఇటీవలే మోడల్, నటుడు మీర్జా బిలాల్ బేగ్ ను వివాహమాడారు. 49 ఏళ్ల రెహామ్ ఖాన్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఇటీవలే సియాటిల్ లో మీర్జా బిలాల్ బేగ్ తో తన నిఖా (వివాహం) జరిగిందని రెహామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.  తన తల్లిదండ్రులు, కుమారుడు పెళ్లిపెద్దలుగా వ్యవహరించారని తెలిపారు. 

కాగా, నటుడు మీర్జా బిలాల్ బేగ్ రెహామ్ ఖాన్ కంటే 13 ఏళ్లు చిన్నవాడు. అయితే, రెహామ్ ఖాన్ కు ఇది మూడో పెళ్లి కాగా, బిలాల్ బేగ్ కు కూడా ఇది మూడో పెళ్లే. రెహామ్ ఖాన్.... తొలుత 1993లో ఇజాజ్ రెహ్మాన్ ను పెళ్లాడి 2005లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2015లో ఇమ్రాన్ ఖాన్ ను పెళ్లాడారు. అదే ఏడాది విడిపోయి సంచలనం సృష్టించారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Imran Khan
Reham Khan
Mirza Bilal Baig
Marriage
Pakistan

More Telugu News