SI: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు తీపి కబురు... వయోపరిమితి రెండేళ్ల పెంపుకు జగన్ ఆదేశాలు

AP govt hikes age limit for Police jobs

  • ఇటీవల ఏపీలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • వయోపరిమితి పెంచాలని విజ్ఞప్తులు
  • పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం
  • సీఎం జగన్ సానుకూల నిర్ణయం

ఏపీలో ఇటీవల ఏపీఎస్పీ, సివిల్ పోలీస్ విభాగంలో 6,511 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడడం తెలిసిందే. 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎస్సై ఉద్యోగాలకు 21-27 ఏళ్ల మధ్య వయసు వారు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18-24 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 

అయితే సుదీర్ఘకాలం తర్వాత పోలీసు ఉద్యోగ నియామకాలు చేపడుతున్నందున వయోపరిమితి సడలిస్తే అత్యధిక సంఖ్యలో నిరుద్యోగులకు అవకాశం కలుగుతుందన్న విజ్ఞప్తులు వచ్చాయి. 

వీటిని ఏపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. పోలీసు ఉద్యోగార్థుల వయోపరిమితిని రెండేళ్లు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులకు లబ్ది చేకూరనుంది.

SI
Constable
Police Jobs
CM Jagan
Age Limit
Notification
Andhra Pradesh
  • Loading...

More Telugu News