KCR: సత్యనారాయణ భౌతికకాయానికి కేసీఆర్ నివాళి.. కొంత కాలం ఇద్దరం కలిసి పని చేశామని వ్యాఖ్య

KCR pays tributes to Satyanarayana

  • సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్
  • హీరోలకు ఉన్నంత గ్లామర్ సత్యనారాయణదని కితాబు
  • అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారని ప్రశంస

టాలీవుడ్ సీనియర్ నటుడు సత్యనారాయణ భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రముఖ సినీ నటులు కైకాల సత్యనారాయణగారు తన విలక్షణమైన నటనాశైలితో పేరు, ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారని చెప్పారు. హీరోలకు ఉండేంత గ్లామర్ ఆయనదని అన్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో జీవిస్తూ అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. 

సత్యనారాయణగారు ఎంపీగా పని చేసినప్పుడు అనుభవాలను పంచుకోవడం జరిగిందని, కొంత కాలం తామంతా కలిసి పనిచేశామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ కైకాల వంటి సీనియర్ ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. సత్యనారాయణగారు లేని లోటును ఎవరూ పూడ్చలేరని చెప్పారు. ఆయన పోషించిన పాత్రలను పోషించేందుకు ఆయనకు సమానమైన నటులు ఇప్పుడు లేరని అన్నారు. ఆయన మృతి బాధాకరమని, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

KCR
TRS
Kaikala Satyanarayana
  • Loading...

More Telugu News