Woman: పెళ్లి పేరుతో యువకుడికి రూ.46 లక్షలకు టోకరా వేసిన మహిళ అరెస్ట్

Police arrest cheating woman

  • పోలీసుల అదుపులో చిత్తూరు జిల్లాకు చెందిన అపర్ణ
  • ఫేస్ బుక్ లో యువకుడితో పరిచయం
  • భారీగా ఆస్తులున్నాయని యువకుడ్ని నమ్మించిన వైనం

పెళ్లి పేరుతో ఓ యువకుడికి రూ.46 లక్షలకు టోపీ వేసిన మాయలాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కిలాడీ పేరు అపర్ణ అలియాస్ శ్వేత. ఆమె చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ. సదరు యువకుడికి ఫేస్ బుక్ లో పరిచయం అయింది. తనకు భారీగా ఆస్తులున్నాయని ఆ యువకుడ్ని నమ్మించింది. 

అయితే ఆ ఆస్తులపై న్యాయ వివాదాలు ఉన్నాయని, ఆ ఆస్తులను విడిపించుకోవాల్సి ఉందని అపర్ణ అతడితో చెప్పింది. అందుకు డబ్బు అవసరం అంటూ ఆ యువకుడి నుంచి పలు దఫాలుగా రూ.46 లక్షల వరకు వసూలు చేసింది. 

అపర్ణ ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువకుడు, మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపర్ణను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఫేస్ బుక్ లో మరో అమ్మాయి ఫొటో పెట్టి ఆమె యువకులను మోసం చేస్తున్నట్టు గుర్తించారు.

More Telugu News