Akhil: బాబోయ్ బిగ్ బాస్ హౌస్ ఓ జైల్ .. టెన్షన్ వచ్చేసింది: హీరో నిఖిల్

Nikhil Interview

  • రేపు రిలీజ్ అవుతున్న '18 పేజెస్'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నిఖిల్ 
  •  తాజాగా ఇంటర్వ్యూలో 'బిగ్ బాస్' గురించిన ప్రస్తావన
  • 105 రోజులు హౌస్ లో ఉండటం కష్టమేనని వ్యాఖ్య  

హీరో నిఖిల్ ఇప్పుడు '18 పేజెస్' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే రీసెంట్ గా నిఖిల్ బిగ్ బాస్ 'గ్రాండ్ ఫినాలే' కి వెళ్లి వచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాలను గురించి నిఖిల్ ప్రస్తావించాడు.

'18 పేజెస్' సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ కి వెళ్లాను. నేను హౌస్ లోకి వస్తాను .. కాసేపు మాట్లాడి అందరికీ హాయ్ చెప్పేసి వెళ్లిపోతానని అనుకున్నారు. కానీ టాప్ ఫైవ్ లో నుంచి ఒకరిని నాతో పాటు బయటికి తీసుకుని రావలసి వచ్చింది. రోహిత్ ను నాతో పాటు తీసుకుని వచ్చేశాను" అన్నాడు. 

" బిగ్ బాస్ స్టేజ్ పైకి వెళ్లి నాగార్జునగారితో మాట్లాడుతున్నంత సేపు చాలా హ్యాపీగా అనిపించింది. హౌస్ లోకి వెళితే అదో జైలు మాదిరిగా అనిపించి టెన్షన్ వచ్చేసింది. పాపం .. అందులో 105 రోజులు వాళ్లు ఉన్నారంటే సామాన్యమైన విషయమేం కాదు" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News