Telangana: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్.. రూ. 900 కోట్ల జరిమానా విధింపు

NGT fines Rs 900 Cr to Telangana government

  • అనుమతులు లేకుండా డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్న ఎన్జీటీ
  • నిర్మాణ వ్యయంలో 1.5 శాతం జరిమానా విధింపు
  • గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) షాక్ ఇచ్చింది. డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ రూ. 900 కోట్ల జరిమానాను విధించింది. నిర్మాణాలను నిలిపివేయాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం నిర్మాణ వ్యయంలో 1.5 శాతం జరిమానాను విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ తీర్పును వెలువరించింది. 

పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వం, కర్నూలుకు చెందిన చంద్రమౌళేశ్వర రెడ్డి అనుబంధ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నామని చెప్పారు.

Telangana
NGT
Dindi
Palamuru Rangareddy
  • Loading...

More Telugu News