Amruta Fadnavis: దేశానికి ఇద్దరు జాతిపితలు.. ఒకరు గాంధీ.. మరొకరు మోదీ: అమృత ఫడ్నవీస్

Two Fathers of the Nation says  Amruta Fadnavis
  • గతంలో మోదీ జన్మదినం సందర్భంగా ఆయనను జాతిపితగా కీర్తించిన అమృత
  • మరి మహాత్మాగాంధీ ఎవరని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న
  • గాంధీ దేశానికి, ఆధునిక భారత్‌కు మోదీ జాతిపితలంటూ సమర్థించుకున్న ఫడ్నవీస్ భార్య
ప్రధానమంత్రి నరేంద్రమోదీని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ఆకాశానికెత్తేశారు. మోదీని జాతిపితగా కీర్తించారు. దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు మహాత్మాగాంధీ అయితే, ఇంకొకరు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని చెప్పుకొచ్చారు. జన్మదినం సందర్భంగా మోదీకి గతంలో శుభాకాంక్షలు చెబుతూ ఆయనను జాతిపితగా అమృత కీర్తించారు.

ఇటీవల ఓ మాక్ కోర్టు ఇంటర్వ్యూకు హాజరైన అమృతను.. మోదీ జాతిపిత అయితే, మరి గాంధీ ఎవరు? అని నిర్వాహకుడు ప్రశ్నించారు. స్పందించిన అమృత గాంధీ దేశానికి జాతిపిత అయితే, ఆధునిక భారతదేశానికి మోదీ జాతిపిత. మొత్తంగా దేశానికి ఇద్దరు జాతిపితలు అని అమృత సమాధానం ఇచ్చారు.
Amruta Fadnavis
Devendra Fadnavis
Mahatma Gandhi
Narendra Modi
Father Of Nation

More Telugu News