Sam Worthington: తెలుగు రాష్ట్రాల్లో 'అవతార్ 2' సంచలనం .. ఐదు రోజుల్లో సాధించిన వసూళ్లు ఇవే!

Avatar 2 movie update

  • ఈ నెల 16వ తేదీన విడుదలైన 'అవతార్ 2'
  • తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 
  • అద్భుతమైన గ్రాఫిక్స్ .. ఆశ్చర్యపరిచే దృశ్యాలు ప్రధానం 
  • ఇప్పట్లో ఇక్కడ ఈ సినిమాకి పోటీ లేనట్టే  

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అవతార్ 2', ఈ నెల 16వ తేదీన థియేటర్లకు వచ్చింది. జేమ్స్ కామెరున్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, తొలి ఆటతోనే సంచలనాత్మక విజయంగా టాక్ తెచ్చుకుంది. టెక్నాలజీ పరంగా ప్రపంచ సినిమాను మరో అడుగు ముందుకు వేయించింది.

2D .. 3D ఫార్మేట్ లలో విడుదలైన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజునే 10 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. 3 రోజుల్లోనే 38 కోట్లను రాబట్టిన ఈ సినిమా, 5వ రోజుతో 47 కోట్ల వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, సంక్రాంతి వరకూ పోటీగా నిలిచే స్థాయి సినిమాలేవీ లేవు. అందువలన 'అవతార్ 2' తీరిగ్గా తన హవాను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

నిజానికి 'అవతార్ 2'లో కనిపించే కథ 25 శాతమే అనుకోవాలి. ఆ కాస్త కథను చెప్పడానికి మిగతా 75 శాతం టెక్నాలజీని ఉపయోగించిన తీరే ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతున్నాయి. కథ సంగతి అలా ఉంచితే, అద్భుతమైన గ్రాఫిక్స్ ను .. ఆశ్చర్యపరిచే దృశ్యాలను చూడటానికి జనాలు ఆసక్తిని చూపిస్తున్నారు.

Sam Worthington
Zoe Saldaña
Sigourney Weaver
Avatar 2
  • Loading...

More Telugu News