Vijay: 'వారసుడు' నుంచి చిత్ర పాడిన ఎమోషనల్ సాంగ్!

Varasudu lyrical song released

  • 'వారసుడు'గా రానున్న విజయ్
  • ఆయన జోడీ కడుతున్న రష్మిక 
  • రెండు భాషల్లో సంక్రాంతికి విడుదల 
  • అదే సమయంలో రిలీజ్ అవుతున్న చిరూ .. బాలయ్య సినిమాలు 

విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఒక ద్విభాషా చిత్రం రూపొందుతోంది. తెలుగులో 'వారసుడు' .. తమిళంలో 'వరిసు' అనే టైటిల్స్ ను ఖరారు చేశారు. విజయ్ జోడీగా రష్మిక నటించిన ఈ సినిమాకి, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. 'అమ్మమ్మ నేనేమి వింటినమ్మా .. వాకిళ్ల నిలిచింది వాస్తవమా, ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా .. అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా' అంటూ ఈ పాట సాగుతోంది. తల్లీకొడుకుల అనుబంధానికి అద్దం పట్టే పాట ఇది.  

తమన్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా చిత్ర ఆలపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తాను కోలీవుడ్ లో కూడా తన జోరు చూపించవచ్చనే ఆశతో రష్మిక ఉంది. ఆమె కోరిక నెరవేరుతుందేమో చూడాలి. ఇక తెలుగులో చిరంజీవి .. బాలకృష్ణ సినిమాలతో ఈ సినిమా తలపడుతుండటం విశేషం.

Vijay
Rashmika Mandanna
Varasudu Movie

More Telugu News