Nayanatara: నీతో ఉన్నది అమ్ము ఆత్మకాదు .. ఇక ప్రతి నిమిషం నీ ప్రాణాలకు ప్రమాదం: 'కనెక్ట్' టీజర్ రిలీజ్

Connect movie teaser released

  • నయనతార తాజాగా చిత్రంగా రూపొందిన 'కనెక్ట్'
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ 
  • ముఖ్యమైన పాత్రల్లో అనుపమ్ ఖేర్ - సత్యరాజ్
  • తెలుగు - తమిళ భాషల్లో ఈ నెల 22న విడుదల

నాయిక ప్రధానంగా నడిచే కథలతో ఇంతవరకూ నయనతార చేస్తూ వెళ్లిన సినిమాలన్నీ దాదాపు విజయాలను అందుకున్నాయి. ఇక హారర్ థ్రిల్లర్ జోనర్లో ఆమె చేసిన సినిమాలు కాసుల వర్షాన్ని కురిపించాయి. తాజాగా ఆమె చేసిన మరో హారర్ థ్రిల్లర్ సినిమానే 'కనెక్ట్'. 

ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం తెలుగు వెర్షన్ కి సంబంధించిన టీజర్ ను వదిలారు. ఆత్మలను పిలిచి మాట్లాడటం అనే ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా ఇది. అలా నాయిక ఒక ఆత్మను పిలిస్తే మరో ఆత్మ వస్తుంది. ఆ తరువాత నుంచి చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి అనేదే కథ. 

టీజర్ తరువాత సినిమాపై ఆసక్తి పెరగడం ఖాయమనే అనిపిస్తోంది. నయనతార సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాను, ఇక్కడ యూవీ క్రియేషన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ .. సత్యరాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నారు.

Nayanatara
Anupam Kher
Sathya Raj
Connect Movie

More Telugu News