Vijayasai Reddy: మెస్సీకి శిక్షణ ఇచ్చింది ఎవరు....చంద్రబాబే అని రాసేయండి: విజయసాయి వ్యంగ్యం

Vijayasai satires on Chandrababu

  • ఫిఫా వరల్డ్ కప్ నెగ్గిన అర్జెంటీనా
  • అద్భుత ఆటతీరు కనబర్చిన మెస్సీ
  • చంద్రబాబును, కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి విజయసాయి ట్వీట్

అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్ కప్ సాధించడం తెలిసిందే. ఫైనల్లో ఫ్రాన్స్ పై 4-2 తేడాతో పెనాల్టీ షూటవుట్ ద్వారా అర్జెంటీనా ప్రపంచవిజేతగా అవతరించింది. దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ తన స్థాయికి తగ్గ ఆటతీరుతో అర్జెంటీనాను ఫైనల్ చేర్చడమే కాకుండా, చాంపియన్ గా నిలిపాడు. 

ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును, కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేశారు. 'అసలు ఫుట్ బాల్ ఆట కనిపెట్టింది ఎవరు? మెస్సీకి శిక్షణ ఇచ్చింది ఎవరు? అర్జెంటీనా కప్ గెలవడానికి కారణం ఎవరు? ఇంకెవరు... మన చంద్రబాబు అని రాసేయండి పచ్చ మీడియా మేధావులూ!'... అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 'రాయల్టీ కూడా చంద్రబాబుకే ఇవ్వాలని డిమాండ్ చేయండి' అంటూ ట్వీట్ చేశారు.

Vijayasai Reddy
Chandrababu
Media
Messi
Argentina
FIFA World Cup
  • Loading...

More Telugu News