Prabhas: యాక్షన్ స్టోరీతో ధనుశ్ ను ఒప్పించిన 'రాధేశ్యామ్' డైరెక్టర్!

Dhanush in Radhakrishna Kumar

  • ప్రభాస్ హీరోగా 'రాధేశ్యామ్' చేసిన రాధాకృష 
  • అంచనాలను అందుకోలేకపోయిన సినిమా 
  • ధనుశ్ హీరోగా ప్రాజెక్టును సెట్ చేస్తున్న దర్శకుడు 
  • యూవీ క్రియేషన్స్ లో పట్టాలపైకి వెళ్లనున్న ప్రాజెక్టు  

ప్రభాస్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో 'రాధేశ్యామ్' ఒకటి. ప్రభాస్ - పూజా హెగ్డే నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అద్భుతమైన విజువల్స్ తో ఆశ్చర్యపరిచినా, కథాకథనాల పరంగా అసంతృప్తిని మిగిల్చింది. 

ప్రభాస్ ను ఉపయోగించుకోవడం మాట అటుంచితే, ఆయనను సరిగ్గా చూపించడానికి కూడా ట్రై చేయలేదంటూ రాధాకృష్ణపై ప్రభాస్ అభిమానులు విమర్శలు గుప్పించారు. అలాంటి రాధాకృష్ణ కుమార్ ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు. ఏ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన పేరు వినిపించలేదు. 

కానీ ఆయన ధనుశ్ హీరోగా ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ధనుశ్ కి ఆయన కథ వినిపించడం .. ధనుశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నారని చెబుతున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతుందని సమాచారం.

More Telugu News