Pawan Kalyan: నా కూతురు పెళ్లికి పవన్ కల్యాణ్ రాకపోవడానికి కారణం ఇదే: అలీ

There is no gap between Pawan and me says Actor Ali

  • తమ ఇద్దరి మధ్య గ్యాప్ లేదన్న అలీ
  • ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు 15 నిమిషాలు మాట్లాడుకున్నామని వెల్లడి
  • విమానం మిస్ కావడంతో పెళ్లికి ఆయన రాలేకపోయారన్న అలీ

తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ కు, కమెడియన్ అలీకి మధ్య ఎంతో అనుబంధం ఉందనే విషయం తెలిసిందే. పవన్ ప్రతి సినిమాలో అలీకి కచ్చితంగా ఒక పాత్ర ఉండేది. అయితే గత ఎన్నికల సమయంలో ఇద్దరికీ మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. వైసీపీలో అలీ చేరడంతో ఇద్దరి మధ్య గ్యాప్ నిజమే అని అందరూ భావించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై అలీ క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. కొన్ని వెబ్ సైట్స్ పనికట్టుకుని ఈ ప్రచారం చేశాయని మండిపడ్డారు. 

ఇటీవల తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి పవన్ నటిస్తున్న సినిమా సెట్ కు వెళ్లానని... తాను వచ్చిన విషయం తెలుసుకుని ఆయనే తన వద్దకు వచ్చారని అలీ చెప్పారు. అదే సమయంలో ఆయనను కలవడానికి వేరే వాళ్లు వచ్చినా... వారిని వెయిట్ చేయమని చెప్పారని తెలిపారు. ఇద్దరం 15 నిమిషాల సేపు మాట్లాడుకున్నామని చెప్పారు. మేం ఏం మాట్లాడుకున్నామనే విషయం సదరు వెబ్ సైట్స్ వాళ్లకు తెలియదని అన్నారు. తన కూతురు పెళ్లికి పవన్ వస్తానని చెప్పారని... అయితే, ఆయన ఎక్కాల్సిన విమానం మిస్ కావడంతో రాలేకపోయారని చెప్పారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని... విషయం తెలియక ఏదో ఒకటి రాస్తున్నారని విమర్శించారు.

Pawan Kalyan
Janasena
Ali
YSRCP
Tollywood
  • Loading...

More Telugu News