Balakrishna: బిగ్ బాస్ సీజన్ 7 హోస్టుగా బాలయ్య?

Bigg Boss 7

  • మొన్ననే ముగిసిన 'బిగ్ బాస్ 6'
  • సీజన్ 7 దిశగా మొదలుకానున్న సన్నాహాలు 
  • హోస్టుగా తెరపైకి బాలయ్య పేరు
  • 'అన్ స్టాపబుల్ 2'ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న బాలయ్య   

బిగ్ బాస్ రియాలిటీ షోకి నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఆరంభంలో కంటే సీజన్ .. సీజన్ కి మధ్య జనంలో ఆసక్తి తగ్గిపోతూ వస్తోంది. ఎవరికీ పెద్దగా తెలియనివారిని కంటెస్టెంట్స్ గా తీసుకోవడం ఒక కారణమనే టాక్ ఉంది. సీజన్ 6 ఆదరణ మరింత తగ్గడం నిర్వాహకులను ఆలోచనలో పడేసిందని టాక్. 

అందువల్లనే ఈ సారి ఈ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా బాలయ్యను తీసుకోవాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టుగా సమాచారం. హోస్టుగా గా కూడా బాలకృష్ణ తానేమిటనేది నిరూపించుకున్నారు. 'అన్ స్టాపబుల్' ను నెంబర్ వన్ టాక్ షోగా నిలబెట్టారు. 

ప్రస్తుతం బాలయ్య 'అన్ స్టాపబుల్ 2'కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. తనదైన స్టైల్లో బాలయ్య ఈ టాక్ షోను రక్తి కట్టిస్తున్నారు. అందువలన 'బిగ్ బాస్ సీజన్ 7' కి హోస్టుగా ఆయనను తీసుకోవాలనే ఉద్దేశంతో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Balakrishna
Bigg Boss
Nagarjuna
  • Loading...

More Telugu News