Nikhil: '18 పేజెస్'లో ట్విస్టులు ఎవరూ గెస్ చేయలేరు: నిఖిల్

Nikhil Interview

  • నిఖిల్ హీరోగా రూపొందిన '18 పేజెస్'
  • ఈ నెల 23వ తేదీన విడుదలవుతున్న సినిమా 
  • ఇది ఒక థ్రిల్లింగ్ లవ్ స్టోరీ అని చెప్పిన నిఖిల్
  • ఈ మధ్య కాలంలో ఇలాంటి కంటెంట్ రాలేదని వెల్లడి  

'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్, '18 పేజెస్' సినిమాతో ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ ప్రేమకథా చిత్రంపై అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడాడు. 

"ఏడాదికి నా సినిమా ఒకటి వస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. కానీ 'కార్తికేయ 2' విడుదలైన నాలుగు నెలల్లోనే '18 పేజెస్' వస్తోంది. పైగా ప్రమోషన్స్ కి పెద్దగా సమయం దొరకలేదనే టెన్షన్ ఉంది. ఈ సినిమా ఒక థ్రిల్లింగ్ లవ్ స్టోరీ. ఎవరూ ఊహించని ఇంటర్వెల్ ట్విస్ట్ .. ఎవరూ ఏ మాత్రం గెస్ చేయని క్లైమాక్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి" అన్నాడు. 

"టీజర్ .. ట్రైలర్ లో చూసిన దానికంటే సినిమాలో ఎక్కువ విషయం ఉంటుంది. ఈ సినిమా చూసిన తరువాత బయటికి వచ్చినవారు ఇలాంటి ఒక సినిమా చేసినందుకు నన్ను అభినందించవచ్చు .. వీడికి మైండ్ దొబ్బిందా అనుకోవచ్చు. అంత కొత్తదనం ఉన్న కంటెంట్ ఇది. స్క్రీన్ ప్లే చివరివరకూ అలా కూర్చోబెట్టేస్తుందంతే" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News