Nikhil: 'రంగస్థలం' అనుపమ చేయవలసిన సినిమా: సుకుమార్

18 pages pre release event

  • '18 పేజెస్' ప్రీ రిలీజ్ ఈవెంటులో సుకుమార్ 
  • సూర్యప్రతాప్ తన ప్రతికథలో భాగమంటూ ప్రశంస
  • ఈ సినిమా క్రెడిట్ తనకే చెందుతుందని వ్యాఖ్య
  • 'పుష్ప 2' కోసం బన్నీ కష్టపడుతున్నాడని వెల్లడి

'18 పేజెస్' .. ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. ఈ సినిమాను బన్నీవాసు - సుకుమార్ కలిసి నిర్మించారు. ఈ నెల 23వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, బన్నీ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ వేదికపై సుకుమార్ మాట్లాడుతూ .. "అల్లు అరవింద్ గారి ఎదురుగా కుర్చీలో కూర్చోవడమే గొప్ప విషయం అనుకున్న నేను, ఆయన ప్రొడక్షన్ హౌస్ తో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది" అన్నాడు. 

"సూర్యప్రతాప్ నా ప్రతి కథలోను భాగమే. నేను చిన్న పాయింట్ చెబితే .. ముచ్చటపడి డెవలప్ చేసి మొత్తం క్రెడిట్ నాకు ఇస్తున్నాడు. మేమంతా వేరు వేరు సినిమాలు చేస్తున్నా, తను మాత్రం నాలుగేళ్లుగా ఈ కథపైనే కూర్చున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ ఆయనదే" అని అన్నాడు. 

ఇక అనుపమ 'రంగస్థలం' చేయాల్సింది .. కానీ కుదరలేదు. తను చాలా మంచి పెర్ఫార్మర్ .. తెలుగు చాలా బాగా వచ్చు" అంటూ కితాబునిచ్చాడు. 'పుష్ప 2' సినిమాను మొన్ననే ఒక ఐదురోజుల పాటు షూట్ చేశాము. ఈ సినిమా కోసం బన్నీ ఎంతో కష్టపడుతున్నాడు. 'పుష్ప 2' అనేది ఏ రేంజ్ ను టచ్ చేస్తుందనేది అప్పుడే చెప్పను" అంటూ ముగించాడు.

Nikhil
Anupama
Sukumar
18 pages
  • Loading...

More Telugu News