Nikhil: బన్నీకి థ్యాంక్స్ చెబితే బాగుండదు: అల్లు అరవింద్

18 pages pre release event

  • ఈ నెల 23న రిలీజ్ అవుతున్న '18 పేజెస్'
  • నిఖిల్ జోడీకట్టిన అనుపమ పరమేశ్వరన్ 
  • సుకుమార్ కథ గొప్పగా ఉందన్న అల్లు అరవింద్ 
  • గోపీసుందర్ సంగీతం హైలైట్ అంటూ కితాబు

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో .. బన్నీ వాసు నిర్మాణంలో రూపొందిన '18 పేజెస్' సినిమా ఈ నెల 23వ తేదీన రాబోతోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాను సమర్పిస్తున్న అల్లు అరవింద్ ఈ వేదికపై మాట్లాడారు. 

"గత మూడు నెలలుగా మా బ్యానర్లో నెలకి ఒక సినిమా చొప్పున రిలీజ్ చేస్తూ వస్తున్నాము. సుకుమార్ ఒక బ్రహ్మాండమైన కథను రాసుకుని వచ్చి, ఈ కథను గీతా ఆర్ట్స్ లో చేస్తే బాగుంటుందని చెప్పి బన్నీవాసుకి ఇచ్చినందుకు సభాముఖంగా ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను" అన్నారు. 

"నానా బన్నీ .. నువ్వు రావడం సహజం .. నీకు థ్యాంక్స్ చెప్పడం అంత బాగోదు. అందువలన నేను ఏమీ చెప్పడం లేదు. గోపీసుందర్ చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, టీమ్ లోని ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను" అంటూ ముగించారు.

Nikhil
Anupama
Allu Aravind
Sukumar
18 pages
  • Loading...

More Telugu News