: 55 వేల 'ఇద్దరమ్మాయిలతో' పైరసీ సీడీలు సీజ్


గుంటూరులోని వీడియో షాపుల యజమానులు 'ఇద్దరమ్మాయిలతో' సినిమాను 55,000 నకలు సీడీలు తయారు చేసి విక్రయించేందుకు సిద్దంగా ఉంచారు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు గుట్టు రట్టు చేసారు. కేవలం రెండు షాపుల్లోనే అల్లు అర్జున్ సినిమాతో పాటూ, తాజాగా వచ్చిన మరో రెండు కొత్త సినిమాలకు సంబంధించిన సీడీలు లభ్యమయ్యాయి. పోలీసులు సీజ్ చేసిన సీడీల విలువ 22 లక్షల రూపాయలు ఉంటుంది.దీంతో షాపు యజామాని చిలమకూరి పూర్ణచంద్రరావును అదుపులోకి తీసుకుని సెక్షన్ 232/2013 292, కాపీ రైట్ చట్టాలు 63, 64 ప్రకారం కేసులు నమోదు చేసారు.

  • Loading...

More Telugu News