Vishal: మళ్లీ శ్రుతిహాసన్ తో యాక్ట్ చేయాలనుంది: విశాల్

Laatti Movie Pre Release Event

  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన 'లాఠీ'
  • తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్  
  • ఈ నెల 22వ తేదీన సినిమా రిలీజ్

మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. ఒక సినిమా తరువాత ఒక సినిమాను ఆయన గ్యాప్ లేకుండా చేస్తూ వెళుతుంటాడు. తమిళంతో పాటు తెలుగులోను తన ప్రతి సినిమాను విడుదలయ్యేలా చూస్తుంటాడు. అలాంటి విశాల్ నుంచి ఆయన తాజా చిత్రంగా రావడానికి 'లాఠీ' ముస్తాబవుతోంది. 

ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును తిరుపతిలో కాలేజ్ స్టూడెంట్స్ సమక్షంలో నిర్వహించారు. 'ఇంతవరకూ మీరు చాలామంది హీరోయిన్స్ తో కలిసి నటించారు కదా? వారిలో మళ్లీ ఎవరితో కలిసి సినిమా చేయాలనుంది? అనే ప్రశ్న విశాల్ కి ఎదురైంది. 

అందుకు విశాల్ ఎంతమాత్రం తడుముకోకుండా శ్రుతి హాసన్ పేరు చెప్పాడు. ఆయన ఆన్సర్ ను స్టూడెంట్స్ ఎంజాయ్ చేశారు. అలాగే ఇంతవరకూ చేసిన సినిమాల్లో ఏ సినిమా ఇష్టమని అడిగితే, ఆయన 'పందెం కోడి' పేరు చెప్పాడు. రమణ - నందు నిర్మించిన 'లాఠీ' సినిమాకి, వినోద్ కుమార్ దర్శకత్వం వహించాడు.

Vishal
Sunaina
  • Loading...

More Telugu News