Abdul Khaleque: మెస్సీ అసోంలో పుట్టాడన్న కాంగ్రెస్ ఎంపీ... భారీ ట్రోలింగ్

Congress MP Abdul Khaleque says Messi has a Assam link

  • ఫిఫా వరల్డ్ కప్ ను ఒడిసిపట్టిన అర్జెంటీనా
  • విజయంలో కీలకపాత్ర పోషించిన మెస్సీ
  • మెస్సీకి అసోంతో కనెక్షన్ ఉందన్న ఎంపీ అబ్దుల్ ఖాలిక్
  • నివ్వెరపోయిన నెటిజన్లు

యావత్ ప్రపంచం ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మేనియా నుంచి ఇంకా తేరుకోలేదు. భారత్ లోనూ ప్రపంచ కప్ సాకర్ టైటిల్ సంగ్రామం తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. అర్జెంటీనా వరల్డ్ కప్ గెలవడాన్ని భారత్ లోని అభిమానులు కూడా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే... దేశాలకు అతీతంగా అభిమానులను సొంతం చేసుకున్న లియోనెల్ మెస్సీ ఆ జట్టులో ఉన్నాడు కాబట్టి. 

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలిక్ తన అజ్ఞానంతో అభాసుపాలయ్యారు. ఈయన అసోంలోని బార్ పేట్ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతరాత్రి అర్జెంటీనా జట్టు 4-2 తేడాతో పెనాల్టీ షూటవుట్ లో ఫ్రాన్స్ ను ఓడించి ఫిఫా వరల్డ్ కప్ ను గెలిచిన తర్వాత ఎంపీ అబ్దుల్ ఖాలిక్ ఓ ట్వీట్ చేశారు. మెస్సీని అభినందిస్తూ, నువ్వు అసోంతో సంబంధం కలిగి ఉన్నందుకు గర్విస్తున్నామని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దాంతో నెటిజన్లు నివ్వెరపోయారు. 

ఓ నెటిజన్ దీనిపై ప్రశ్నిస్తూ, మెస్సీకి అసోంతో కనెక్షన్ ఉందా? అంటూ ట్వీట్ చేయగా.... అవును, మెస్సీ అసోంలోనే పుట్టాడు అంటూ ఎంపీ బదులిచ్చారు. ఈ ట్వీట్లు కొద్ది సమయంలోనే వైరల్ అయ్యాయి. నెటిజన్లు కాంగ్రెస్ ఎంపీపై ఓ రేంజిలో విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎంపీ తన ట్వీట్లను తొలగించారు. 

Abdul Khaleque
Messi
Assam
Argentina
FIFA World Cup
  • Loading...

More Telugu News