Rahi Khanna: రెడ్ అండ్ గోల్డ్ శారీలో అందాల డైమండ్ .. రాశి ఖన్నా న్యూ పిక్స్!

Rashi khanna special

  • గ్లామరస్ హీరోయిన్ గా రాశి ఖన్నా
  • యూత్ నుంచి మంచి ఫాలోయింగ్ 
  • ఇటీవలే స్పీడ్ పెంచిన రాశి ఖన్నా
  • వెబ్ సిరీస్ లను కూడా వదలని వైనం 
  • ఊహాలోకంలోకి తీసుకెళుతున్న ఆమె పిక్స్

వెండితెరపై నుంచి జారిపడే సౌందర్య జలపాతంలా రాశి ఖన్నా కనిపిస్తుంది. చక్కని మేనిఛాయతో  .. హైటుకి తగిన ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. యూత్ లో ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. కెరియర్ ఆరంభంలో నిదానమే ప్రధానమన్నట్టుగా ఆమె ధోరణి ఉండేది. అందానికి లోటు లేదు .. అభినయం కొత్తకాదు .. అయినా రాశి ఖన్నా జోరు పెంచడం లేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. అప్పటి నుంచే రాశి ఖన్నా కాస్త స్పీడ్ పెంచింది. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషలపై దృష్టి పెట్టింది. అలాగే వెబ్ సిరీస్ లపై కూడా కాస్త గాట్టిగానే దృష్టి పెట్టింది. తెలుగులో ఇటీవల ఆమె చేసిన 'థ్యాంక్యూ' సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే గ్లామర్ పరంగా రాశి ఖన్నాకు పడవలసిన మార్కులు పడ్డాయి. మోడ్రన్ డ్రెస్ లలోనే కాదు చీరకట్టులోను ఆమె అప్సరసలకు అసూయ పుట్టిస్తుంది. తాజాగా వచ్చిన రాశి ఖన్నా పిక్స్ చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఆమెలో గ్లామర్ ఎంతమాత్రం తగ్గలేదనే విషయాన్ని ఈ పిక్స్ చాటి చెబుతున్నాయి. రెడ్ అండ్ గోల్డ్ కలర్ శారీలో, రాశి ఖన్నా అందాల డైమండ్ లా మెరిసిపోతోంది. పడుచు మనసులను పరుగులు తీయిస్తోంది. అందం తనకి తానుగా పెట్టుకున్న పేరే రాశి ఖన్నా అనిపిస్తోంది.

Rahi Khanna
Actress
Special
Tollywood
  • Loading...

More Telugu News