Sundar Pichai: యావత్ ప్రపంచం దీనికోసమే వెదికినట్టుగా ఉంది: సుందర్ పిచాయ్

Sundar Pichai says FIFA World Cup final was the most searched in 25 years of google history

  • అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్
  • రికార్డు స్థాయిలో సెర్చ్ చేశారన్న సుందర్ పిచాయ్
  • 25 ఏళ్లలో ఇదే హయ్యస్ట్ ట్రాఫిక్ అని వెల్లడి

ఫుట్ బాల్ వరల్డ్ కప్ చరిత్రలో అర్జెంటీనా-ఫ్రాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను మించింది మరొకటి లేదని ఫిపా గతరాత్రి ఓ ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. నువ్వా? నేనా? అన్నట్టుగా అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ కోసం కొదమసింహాల్లా తలపడిన వేళ... అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. 

మెస్సీ సేన తొలి అర్ధభాగంలో 2 రెండు గోల్స్ కొడితే, ఫ్రాన్స్ ఆటగాడు కిలియన్ ఎంబాపే సంచలన ఆటతీరుతో రెండు గోల్స్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఎక్స్ ట్రా టైమ్ లో అర్జెంటీనా మరో గోల్ కొడితే, ఎంబాపే ఇంకో గోల్ కొట్టి మళ్లీ సమం చేశాడు. చివరికి గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ అద్భుత ప్రదర్శనతో పెనాల్టీ షూటవుట్ లో అర్జెంటీనా నెగ్గింది. తద్వారా ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 

ఇక ఈ మ్యాచ్ పై గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. గత పాతికేళ్లలో మరే అంశం కోసం వెదకనంతగా, ప్రజలు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం సెర్చ్ చేశారని తెలిపారు. గత 25 ఏళ్లలో ఈ స్థాయిలో ఇంటర్నెట్ ట్రాఫిక్ ఎప్పుడూ నమోదు కాలేదని పిచాయ్ వెల్లడించారు. ఒకే ఒక్క అంశం కోసం యావత్ ప్రపంచం వెదికినట్టుగా ఉందని అభివర్ణించారు. 

'అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్' అనే సెర్చ్ టర్మ్ తో డిసెంబరు 18వ తేదీన కోటి మందికి పైగా సెర్చ్ చేశారని గూగుల్ ట్రెండ్ (ఇండియా) డేటాలో వెల్లడైంది. ఇక 'ఫిఫా వరల్డ్ కప్ టీమ్స్' కోసం 2 లక్షల మంది, 'మెస్సి' భార్య గురించిన వివరాల కోసం 1 లక్ష మంది, అర్జెంటీనా సాకర్ దిగ్గజం 'డీగో మారడోనా' కోసం 1 లక్ష మంది వెదికినట్టు గూగుల్ పేర్కొంది.

  • Loading...

More Telugu News