Anupama Parameshwaran: అనుపమను చూస్తే అందం అసూయ పడాల్సిందే .. లేటెస్ట్ పిక్స్!

Anupama Latest Pics

  • యూత్ లో అనుపమకు మంచి క్రేజ్
  • అనుపమలో ఆమె కళ్లే ప్రత్యేక ఆకర్షణ
  • గ్లామర్ పరంగాను .. నటన పరంగాను మంచి మార్కులు 
  • ఈ నెల 23న వస్తున్న '18 పేజెస్'

యంగ్ హీరోల జోడీగా ఇమిడిపోయే కుదురైన రూపం అనుపమ పరమేశ్వరన్ సొంతం. ఆకర్షణీయమైన కళ్లు ఉన్న హీరోయిన్స్ జాబితాలో అనుపమ కూడా కనిపిస్తుంది. విశాలమైన ఆ కళ్లతోనే యూత్ ను ఆమె థియేటర్స్ కి లాగేస్తుంది. తన దృష్టిలో అందం ... అభినయం ఉన్న హీరోయిన్ అనుపమ అని దిల్ రాజు వంటివారే కితాబు ఇవ్వడం విశేషం. అలాంటి అనుపమ కొత్త హీరోయిన్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుంటూ ముందుకు వెళుతోంది. ఈ మధ్య వచ్చిన 'కార్తికేయ 2' ఆమెకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. ఈ నెల 23వ తేదీన '18 పేజెస్' సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో అనుపమ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ ను వదిలారు. ఈ ఫొటోల్లో అనుపమ నీలిరంగు చీరకట్టులో .. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో తామరపువ్వును తలపిస్తోంది. కారవాన్ లో తీసిన ఈ ఫొటోలు కుర్ర మనసులను కట్టిపడేస్తున్నాయి.

Anupama Parameshwaran
Nikhil
18 Pages
  • Loading...

More Telugu News