Revanth Reddy: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే... ఇంట్లో మిగిలింది వీళ్లిద్దరే!

Revanth and Srihan in final fray for Bigg Boss title

  • ఆసక్తికరంగా బిగ్ బాస్ సీజన్-6 ఫైనల్ ఎపిసోడ్
  • రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ ల మధ్య పోటీ
  • రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్
  • రేవంత్, శ్రీహాన్ మధ్య టైటిల్ పోరు

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ సీజన్-6 నేటితో ముగియనుంది. ఇవాళ ఫైనల్ డే కాగా, రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ టైటిల్ బరిలో నిలిచారు. అయితే, గ్రాండ్ ఫినాలే ప్రారంభమైన అనంతరం తొలుత రోహిత్ ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత ఆదిరెడ్డి, కీర్తి కూడా బిగ్ బాస్ హౌస్ ను వీడారు. ఇక బిగ్ బాస్ విన్నర్ టైటిల్ కోసం రేవంత్, శ్రీహాన్ మిగిలారు. 

అంతకుముందు, బిగ్ బాస్ వేదికపై ధమాకా హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల సందడి చేశారు. ప్రైజ్ మనీలో 30 శాతం క్యాష్ తో రవితేజ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి కంటెస్టెంట్లను ఊరించేందుకు ప్రయత్నించారు. అయితే ఎవరూ క్యాష్ తీసుకునేందుకు అంగీకరించకపోవడంతో, కీర్తిని ఇంటి నుంచి బయటికి తీసుకురావాలని రవితేజకు నాగ్ సూచించారు. దాంతో కీర్తి ఎలిమినేట్ అయింది.

Revanth Reddy
Srihan
Bigg Boss
Season-6
  • Loading...

More Telugu News