Madhu Yaskhi: నా చిన్న తమ్ముడు రేవంత్ రెడ్డి ఈ విషయం గమనిస్తే మంచిది: మధు యాష్కీ

Madhu Yashki slams Revanth Reddy

  • తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు
  • రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లు!
  • అన్ని వర్గాలు కలిస్తేనే కాంగ్రెస్ అన్న మధు యాష్కీ

పీసీసీ కమిటీల ప్రకటన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ లో లుకలుకలు మరింత ముదిరిన నేపథ్యంలో సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలు కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అని మధు యాష్కీ స్పష్టం చేశారు. కొత్తవాళ్లకు పదవులు ఇస్తే అసంతృప్తులు ఉంటాయని తెలియదా? నా చిన్న తమ్ముడు రేవంత్ రెడ్డి ఈ విషయం గ్రహిస్తే మంచిది అని హితవు పలికారు. 

"నీ వర్గం మద్దతుతో పదవిలోకి వచ్చావు. పదవిని చేపట్టాక ఏంచేయాలి? న్యాయవాదిగా ఉన్న వ్యక్తి జడ్జి స్థానంలో కూర్చుంటే న్యాయవాదిలా ఆలోచించడు... న్యాయం గురించి ఆలోచించాలి. పార్టీ నాయకుడు కూడా ఇలాగే వ్యవహరించాలి. పరిస్థితిని అందరికీ వివరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే పార్టీ బలం పుంజుకుని అధికారంలోకి వస్తుంది. కానీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురైతే విజయం ఎలా సాధ్యమవుతుంది? ఆయనొక వర్గాన్ని తీసుకువస్తే, నేనొక వర్గాన్ని తీసుకువస్తే అది వర్గ పోరు అవుతుంది. ఇక్కడ మేం కోరుకుంటోంది అందరం కలిసి పనిచేసి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే" అని మధు యాష్కీ వివరించారు.

Madhu Yaskhi
Revanth Reddy
Congress
Telangana
  • Loading...

More Telugu News