Infosys Narayana Murthy: యువత ఉన్నతికి విద్యార్థి దశే పునాది: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

Infosys Narayana Murthy attends AU old students alumni
  • ఏపీలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పర్యటన
  • విశాఖలో ఏయూ పూర్వ విద్యార్థుల ఆరో సమావేశం
  • హాజరైన నారాయణమూర్తి
  • రాజాంలో జీఎంఆర్ సంస్థల సందర్శన
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం 6వ సమావేశానికి హాజరయ్యారు. విశాఖలో ఈ కార్యక్రమం జరిగింది. అటు, విజయనగరం జిల్లా రాజాంలో జీఎంఆర్ సంస్థలను కూడా నారాయణమూర్తి సందర్శించారు. ఉపాధి శిక్షణ కేంద్రం, ఆసుపత్రి, విద్యాసంస్థలను పరిశీలించారు. జీఎంఆర్ ఐటీ కళాశాల రజతోత్సవాల్లోనూ పాల్గొన్నారు. 

ఈ క్రమంలో, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాట్లాడుతూ, యువత ఉన్నతికి విద్యార్థి దశే పునాది అని వెల్లడించారు. మంచి ఆలోచనలు, పోటీతత్వంతో విద్యార్థులు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. శక్తిసామర్థ్యాలు పెంచుకుంటేనే అవకాశాలు అందుకోగలరని సూచించారు. యువత శక్తిసామర్థ్యాలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.
Infosys Narayana Murthy
Alumni
Andhra University
GMR
Andhra Pradesh

More Telugu News