Tollywood: పుష్ప వచ్చి ఏడాది.. ప్రత్యేక ఫొటో విడుదల చేసిన చిత్ర బృందం

A lovely picture of Pushpa team from their recent tour

  • గతేడాది డిసెంబర్ 17న విడుదలైన చిత్రం
  • భారీ విజయంతో రూ. 400 కోట్లు వసూలు
  • ప్రస్తుతం రెండో పార్టు చిత్రీకరిస్తున్న సుకుమార్

అల్లు అర్జున్–సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప–ది రైజ్ సంచలన విజయం సాధించింది. టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్యాన్ ఇండియా స్థాయిలో గతేడాది డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ చిత్రం హిందీలోనూ ఓ ఊపు ఊపింది. ఒక్క సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియాగా స్టార్ గా మారిపోయారు. హీరోయిన్ రష్మికకు సైతం బాలీవుడ్ లో వరుస ఆఫర్లు తెచ్చిపెట్టిందీ చిత్రం. మొత్తంగా రూ. 400 కోట్లు వసూలు చేసింది. 

హిందీలోనే వంద కోట్లు రావడం విశేషం. ప్రస్తుతం రెండో పార్టు కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చిత్రం రెండో భాగం పుష్ప–ది రూల్ ను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు దర్శకుడు సుకుమార్. తొలి పార్టు విడుదలైన ఏడాది అయిన సందర్భాన్ని చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ క్రమంలో  ప్రత్యేక ఫొటోను విడుదల చేసింది. పుష్ప ఇటీవల రష్యాలో విడుదలైంది. ఈ సందర్భంగా బన్నీ, రష్మిక, సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రష్యా పర్యటనకు వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Tollywood
Pushpa
Allu Arjun
Rashmika Mandanna
sukumar
1year
photo

More Telugu News