china vaccine: కరోనాపై ప్రభావం చూపని చైనా వ్యాక్సిన్...వియాన్ న్యూస్ సంచలన కథనం

china made vaccine for covid is bogus

  • పనికిమాలిన వ్యాక్సిన్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటమంటూ విమర్శ
  • కోట్లాది జనం ప్రాణాలను జిన్ పింగ్ రిస్క్ లో పెట్టారని మండిపాటు

చైనాలో తయారైన వస్తువులే కాదు వ్యాక్సిన్లు కూడా పనికిరావని మరోమారు ఆరోపణలు వెల్లువెత్తాయి. కొవిడ్ నియంత్రణ కోసం చైనా తయారుచేసిన వ్యాక్సిన్ తో ఉపయోగమేలేదని వియాన్ న్యూస్ ఓ సంచలన కథనం వెలువరించింది. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టామంటూ ఊదరగొట్టి పనికిరాని వ్యాక్సిన్ ను ప్రజలకు అంటగట్టిందని వివరించింది. విదేశీ వ్యాక్సిన్లను నిరాకరించి, తమ దేశంలోనే తయారైన పనికిమాలిన వ్యాక్సిన్లు వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శలు గుప్పించింది. చైనా పంపిన కరోనా వ్యాక్సిన్ తో ఎలాంటి ఉపయోగం ఉండదని పేద దేశాలు చాలా రోజుల క్రితమే గుర్తించాయని పేర్కొంది.

2020 నవంబర్ లో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టామని చైనా అధినేత షీ జిన్ పింగ్ ప్రకటించారు. ఆపై ప్రపంచ దేశాలకు 180 కోట్ల డోసులను అందజేశారు. అందులో 32.8 కోట్ల డోసులను ప్రపంచంలోని పేద దేశాలకు ఉచితంగా అందించినట్లు చైనా పేర్కొంది. ఆయా దేశాలు మాత్రం చైనా వ్యాక్సిన్ ప్రభావంపై పెదవి విరిచాయి. కరోనాను కంట్రోల్ చేయడంలో వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపట్లేదని బహిరంగంగానే వెల్లడించాయి. 

చైనా వ్యాక్సిన్ పై నమ్మకంతో పాకిస్థాన్ మిగతా వ్యాక్సిన్లను కొనుగోలు చేయలేదు.. దీంతో దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. పాకిస్థాన్ తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, ఇండోనేసియా.. ఇలా పలుదేశాలు చైనా వ్యాక్సిన్‌ పనికిరానిదేనని గతంలోనే తేల్చేశాయి. తాజాగా చైనా వ్యాక్సిన్లను అందుకున్న కాంబోడియా.. వాటిని వాడాలా వద్దా అనే సందిగ్ధంలో పడిందని వియాన్‌ న్యూస్ కథనం వెల్లడించింది.

చైనా వ్యాక్సిన్లు పనిచేయట్లేదన్న తన ఆరోపణలకు మద్దతుగా వియాన్ న్యూస్ కొన్ని ప్రశ్నలను సంధించింది. చైనాలో తయారైన వ్యాక్సిన్ అంత ప్రభావవంతమైనదే అయితే ఆ దేశంలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని నిలదీసింది. ప్రజలందరూ వ్యాక్సిన్లు తీసుకున్నాక కూడా లాక్ డౌన్లు, కంటైన్ మెంట్ జోన్లు, జీరో కొవిడ్ పాలసీ ఎందుకని ప్రశ్నించింది. ప్రపంచంలో కరోనా ప్రభావం తగ్గుతున్నా చైనాలో మాత్రమే వైరస్ తీవ్రత ఎందుకు పెరుగుతోందని వియాన్ న్యూస్ తన కథనంలో నిలదీసింది.

  • Loading...

More Telugu News