Pooja Hegde: అందానికే అందం పూజ హెగ్డే .. లేటెస్ట్ పిక్స్ ఇవిగో!

- నాజూకు భామగా పూజ హెగ్డేకి మంచి మార్కులు
- పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న హీరోయిన్
- ఫ్లాపుల తరువాత కూడా తగ్గని క్రేజ్
- యూత్ లో పెరుగుతూనే ఉన్న ఫాలోయింగ్
- నెక్స్ట్ మూవీ మహేశ్ బాబుతో
పూజ హెగ్డే టాలీవుడ్ లోకి అడుగుపెడుతూనే నాజూకు భామగా మంచి మార్కులు కొట్టేసింది. అందం .. అందుకు తగిన అభినయాన్ని కలిగిన పూజ హెగ్డేకు అదృష్టం కూడా తోడైంది. దాంతో అవకాశాలు ఆమె గుమ్మం ముందు క్యూ కట్టాయి. వరుస సినిమాలు .. వరుస విజయాలు పూజ స్థాయిని మరింత పెంచుతూ వెళ్లాయి.
తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా మారడానికి పూజ ఎక్కువ సమయం తీసుకోలేదు. పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ఆమె తన జోరును కొనసాగిస్తూ వెళ్లింది. పూజ ఉంటే ఆ సినిమా హిట్టే అని స్థాయికి ఆమె గ్రాఫ్ వెళ్లింది. ఆమె డిమాండ్ చేసినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడలేదు.

తాజాగా ఆమె లేటెస్ట్ పిక్స్ ను వదిలారు. యాష్ కలర్ డ్రెస్ లో .. వాలుకళ్లతో .. వేడి చూపులతో పూజ కుర్రమనసులను కట్టిపడేస్తోంది. భారీ ఫ్లాపుల తరువాత కూడా ఆమె క్రేజ్ తగ్గకపోవడానికీ .. అవకాశాలు వెతుక్కుంటూ రావడానికి ఆమె గ్లామర్ కారణమని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదేమో.
