Pooja Hegde: ఈ ఏడాదికి ఇంతే .. మురిపించలేకపోయిన ముగ్గురు భామలు!

Top Three Heroines Special

  • టాప్ త్రీ హీరోయిన్స్ గా పూజ .. రష్మిక .. కీర్తి 
  • ముగ్గురికీ కలిసిరాని 2022
  • మూడు ఫ్లాపులతో ఉన్న పూజ హెగ్డే 
  • అసంతృప్తినే మిగిల్చిన రష్మిక సినిమాలు 
  • ఆశించినస్థాయి హిట్ ను అందుకోలేకపోయిన కీర్తి సురేశ్ 

టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్స్ లో టాప్ 3 పొజీషన్ లో ఎవరున్నారు? అనే ప్రశ్నకి సమాధానంగా పూజ హెగ్డే .. రష్మిక .. కీర్తి సురేశ్ కనిపిస్తారు. తెలుగు తెరపై కొంతకాలంగా ఈ ముగ్గురి జోరు కొనసాగుతోంది. ఏ స్టార్ హీరో జోడీగా చూసినా ఈ ముగ్గురే కనిపిస్తూ వస్తున్నారు. వీరిని బీట్ చేసే హీరోయిన్ అయితే ఇంతవరకూ రాలేదు. అయితే ఈ ఏడాదిలో ఈ ముగ్గురి పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడం వారి అభిమానులను నిరాశపరిచింది. 

పూజ హెగ్డే నుంచి 'రాధే శ్యామ్' .. ' బీస్ట్' .. 'ఆచార్య' సినిమాలు రాగా, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కేటగిరీలోకి అడుగుపెట్టలేకపోయింది. చాలా తక్కువ గ్యాపులో థియేటర్లకు వచ్చిన ఈ మూడు సినిమాలు, ఆమె గ్రాఫ్ పై ఎఫెక్ట్ పడేలా చేశాయి. ఇక రష్మిక విషయానికొస్తే ఆమె చేసిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' పరాజయం పాలైంది. 'సీతా రామం' హిట్ అయినప్పటికీ అందులో ఆమె కనిపించింది హీరోయిన్ గా కాకపోవడంతో ఆ క్రెడిట్ మృణాళ్ ఠాకూర్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక కీర్తి సురేశ్ నుంచి వచ్చిన 'గుడ్ లక్ సఖి' ఆమెకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక నాయిక ప్రధానమైన కథలను ఇప్పట్లో చేయకూడదనే నిర్ణయానికి ఆమెను తెచ్చింది. ఆ తరువాత సినిమాగా 'సర్కారువారి పాట' చేసింది. మహేశ్ బాబు క్రేజ్ మాత్రమే ఈ సినిమాకి వసూళ్లను తెచ్చే బాధ్యతను భుజాలపై వేసుకుంది. కథాకథనాల పరంగా మాత్రం అభిమానులను సంతృప్తి పరచలేకపోయింది. ఇలా చూసుకుంటే ఈ ఏడాదిలో టాప్ 3లో ఉన్న ముగ్గురు హీరోయిన్స్ కి కూడా సరైన హిట్ పడకుండానే పోయిందని చెప్పాలి.

More Telugu News