Manchu Manoj: మరోసారి జంటగా కనిపించిన మంచు మనోజ్​, భూమా మౌనిక.. పెళ్లి డేట్ ఫిక్స్!

Wedding date locked for Manchu Manoj

  • శోభా నాగిరెడ్డి జయంతి కార్యక్రమాలలో పాల్గొన్న మనోజ్
  • త్వరలో కొత్త జీవితం ప్రారంభిస్తానని ప్రకటించిన మనోజ్
  • ఫిబ్రవరి రెండో వారంలో మనోజ్–మౌనిక పెళ్లి చేసుకుంటారని వార్తలు!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి–శోభ దంపతుల కుమార్తె భూమా మౌనిక రెడ్డి మరోసారి జంటగా కనిపించారు. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డలో నిర్వహించిన కార్యక్రమానికి మంచు మనోజ్ హాజరయ్యాడు. మౌనికతో కలిసి శోభా నాగిరెడ్డికి నివాళులు అర్పించాడు. భూమా కుటుంబ సభ్యులను పలుకరించాడు. ఇదే రోజు కడపలోని ప్రఖ్యాత పెద్దదర్గాను మనోజ్‌ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్ కొన్ని వ్యక్తిగత కారణాల వలన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నానని చెప్పాడు. 

అదే సమయంలో త్వరలోనే కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నానని చెప్పాడు. దాంతో, మనోజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడన్న అభిప్రాయాలు మొదలయ్యాయి. రెండో వారంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. మనోజ్ గతంలో ప్రణతిరెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటిరిగా ఉన్న మనోజ్.. తన చిన్ననాటి స్నేహితురాలైన భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇప్పటిదాకా ఇద్దరూ స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు.

Manchu Manoj
bhuma mounika
allagadda
marriage
  • Loading...

More Telugu News