KTR: డాన్ మోడ్... అంటూ ఆసక్తికర ఫొటో పంచుకున్న కేటీఆర్

KTR shares don look photo of his past

  • పాత ఫొటో ట్వీట్ చేసిన కేటీఆర్
  • అమెరికా వెళ్లినప్పటి ఫొటో 
  • నెటిజన్ల నుంచి విశేష స్పందన 

తెలంగాణ మంత్రి కేటీఆర్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటోలు పంచుకుంటుంటారు. వాటిలో బాల్యానికి సంబంధించినవి, విద్యార్థిగా ఉన్నప్పటి ఫొటోలు కూడా ఉంటాయి. అవి నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. 

తాజాగా, గతంలో తాను అమెరికా వెళ్లినప్పటి ఫొటోను కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. శాన్ డియాగో నగరంలో ఫుట్ పాత్ పై నడుస్తున్న కేటీఆర్ ను ఆ ఫొటోలో చూడొచ్చు. అంతేకాదు, ఆ ఫొటోకు 'డాన్ మోడ్' అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఎందుకంటే... నల్లదుస్తుల్లో ఉన్న కేటీఆర్, కళ్లకు గాగుల్స్, కాళ్లకు హాఫ్ షూస్ తో ఓ డాన్ లానే ఉన్నారు... ఆయన చుట్టూ ఉన్నవారు కూడా కేటీఆర్ కు డాన్ లుక్ రావడానికి కారణమయ్యారు. నెటిజన్ల నుంచి ఈ ఫొటోకు విశేషమైన స్పందన లభిస్తోంది.

KTR
Photo
Don Mode
Twitter
BRS
Telangana

More Telugu News