Raviteja: నేను వెనకున్న వాళ్లను చూసుకుని ముందుకొచ్చినోణ్ణి కాదురోయ్: 'ధమాకా' ట్రైలర్ రిలీజ్!

Dhamaka movie trailer released

  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'ధమాకా'
  • ద్విపాత్రాభినయం చేసిన రవితేజ 
  • రవితేజ ఫ్యాన్స్ ను ఖుషీ చేసే డైలాగ్స్ 
  • ఈ నెల 23వ తేదీన థియేటర్లకు రానున్న సినిమా 

రవితేజకున్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. తన సినిమాల్లో మాస్ కంటెంట్ పుష్కలంగా ఉండేలా ఆయన సెట్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటి రవితేజ తాజా చిత్రంగా 'ధమాకా' రూపొందింది. మాస్ లుక్ తోను ... క్లాస్ లుక్ తోను రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన రిలీజ్ కానుంది.  

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. డాన్స్ .. పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్ ను మిక్స్ చేసి ట్రైలర్ ను వదిలారు. 'కోట్లలో ఒకడాడు .. కొడితే కోలుకోలేరు' అనే డైలాగ్ తోనే ఈ సినిమాలో మాస్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందనేది ఊహించుకోవచ్చు. 

'నేను వెనకున్నవాళ్లను చూసుకుని ముందుకొచ్చినోనోణ్ణి కాదు .. వెనక ఎవడూ లేకపోయినా ముందుకు రావొచ్చు అన్ని ఎగ్జామ్ పుల్ సెట్ చేసినవాడిని' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆయన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. రవితేజ జోడీగా శ్రీలీల అలరించనుండగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో సచిన్ ఖేడ్కర్ .. జయరామ్ .. రావు రమేశ్ కనిపించనున్నారు.

Raviteja
Sreeleela
Rao Ramesh
Dhamaka Movie

More Telugu News