Raghu Rama Krishna Raju: సునీల్ నన్ను కొట్టారు.. సీఎం జగన్ వీడియో ద్వారా చూశారు: మోదీకి రఘురామకృష్ణరాజు లేఖ

Raghu Rama Krishna Raju writes letter to Modi

  • సీఐడీ అధికారులు కస్టోడియల్ టార్చర్ చేశారన్న రఘురాజు
  • పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ విచారణ అధికారులను పిలవలేదన్న ఎంపీ
  • ఎవరు కొట్టారో ఇంకా విచారణ జరపలేదని ఆవేదన

ప్రధాని మోదీకి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేసి, కస్టోడియల్ టార్చర్ చేశారంటూ లేఖలో ఆయన ఆరోపించారు. విచారణ అధికారులను పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఇంకా పిలవలేదని పేర్కొన్నారు. తనను ఎవరు కొట్టారో ఇంకా విచారణే జరపలేదని అన్నారు. ఈ అంశంపై త్వరగా విచారణ జరిపించాలని కోరారు. తనను సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ కొట్టారని, ముఖ్యమంత్రి జగన్ వీడియో ద్వారా దానిని చూశారని ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై విచారణ జరిపించాలని కోరారు.

Raghu Rama Krishna Raju
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News