Vijay: 'వారసుడు' ప్రీ రిలీజ్ ఈవెంటుకి చీఫ్ గెస్టుగా పవన్ కల్యాణ్?

Varasudu Movie Update

  • ద్విభాషా చిత్రంగా రూపొందిన 'వారసుడు'
  • విజయ్ జోడీగా మెరవనున్న రష్మిక 
  • ఈ నెల 27వ  తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • జనవరి 12వ తేదీన సినిమా రిలీజ్  

తమిళంలో విజయ్ కి ఉన్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన సినిమా రిలీజ్ అయితే అక్కడి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. అలాంటి విజయ్ మొదటిసారిగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు .. డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి తెలుగు - తమిళ భాషల్లో ఒక సినిమా చేశాడు. 
 
ఈ రెండు భాషల్లో ఒకే సమయంలో ఆయన చేసిన ఆ సినిమా, తెలుగులో 'వారసుడు' .. తమిళంలో 'వరిసు' పేరుతో పలకరించనుంది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. కోలీవుడ్ లో అయితే ఓకేగానీ, తెలుగులో అయితే అదే రోజున బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' .. ఆ తరువాత రోజున చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' విడుదల కానున్నాయి. 

ఇటు చిరంజీవి .. అటు బాలయ్య ఇద్దరి సినిమాలకి మంచి బజ్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో విజయ్ సినిమా వస్తుండటం విశేషం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కల్యాణ్ వస్తున్నాడనేది తాజా సమాచారం. తెలుగు వెర్షన్ కి సంబంధించి ఈ నెల 27వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్ .. ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Vijay
Rashmika Mandanna
Sharath Kumar
Prakash Raj
Varasudu
  • Loading...

More Telugu News